నూతన ఫైర్ స్టేషన్‌ ప్రారంభించిన మంత్రి సుచరిత | Sucharita Inaugurated New Fire Station In Vijayawada

2019-07-20 301

Andra Pradesh Home Minister Sucharita inaugurated a newly built district fire station near the Vijayawada Lenin Center on Saturday.On this occasion she said that she was happy to open a new fire station in the city
#MekathotiSucharitha
#vijayawada
#FireServicesDepartment
#LeninCenter
#YSRCongressParty
#HomeMinister
#LeninCenter

విజయవాడ లెనిన్ సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన జిల్లా ఫైర్ స్టేషన్‌ను రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నగరంలో కొత్తగా ఫైర్ స్టేషన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో మొత్తం 184 ఫైర్ స్టేషన్‌లు ఉన్నాయని.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని డిమాండ్స్ వినిపిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఒకప్పుడు తాటాకు ఇల్లు ఎక్కువగా ఉండటం వల్ల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరిగేవని.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి ప్రతి పేదవాడికి గృహ నిర్మాణం చేపట్టడంతో ఈ సమస్య చాలా వరకు తగ్గిందని హోంమంత్రి అభిప్రాయపడ్డారు.

Videos similaires